సిద్దిపేటజిల్లా.కొండపాకమండలం.మార్చ్5
కొండపాక మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన యువతి వివాహం చేసుకుందని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సిద్దిపేట త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ టి. లక్ష్మీబాబు తెలిపిన వివరాల ప్రకారం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమీన్పూర్ జిల్లా మిస్త్రీపూర్ గ్రామానికి చెందిన సౌరబ్ కుమార్, ప్రదీప్ కుమార్‌లు సోదరులు. వీరు గత మూడు సంవత్సరాలుగా అల్యూమినియం అండ్ డిజైన్ LLP సంస్థలో పనిచేస్తూ, దుద్దెడ గ్రామంలో కే. రాజేశ్వర్ రావు ఇంటి రెండో అంతస్తులో అద్దెకు నివసిస్తున్నారు.
ఇటీవల సౌరబ్ కుమార్ స్వగ్రామానికి వెళ్లగా,03-03-2026 రాత్రి సుమారు 9:15 గంటల సమయంలో ప్రదీప్ కుమార్ అద్దె గదిలో ఫ్యాన్ హుక్‌కు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న సహోద్యోగులు బాలకృష్ణ రెడ్డి, రాజ్ కుమార్, శివ కుమార్, సోను కుమార్‌లు అక్కడికి చేరుకుని అతడిని కిందకు దించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు.మృతుడు గతంలో తనతో కలిసి పని చేసిన ఓ యువతిని ప్రేమించాడని, ఆమె గత సంవత్సరం సంస్థను వీడి ఇతర చోటుకు వెళ్లి ఇటీవల వివాహం చేసుకుందని సమాచారం. ఈ కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని మృతుని సోదరుడు సౌరబ్ కుమార్ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
•ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ప్రేమ విఫలం… యువకుడు ఆత్మహత్య
RELATED ARTICLES

