Thursday, March 5, 2026
ads
Homeఎడిటోరియల్మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం

మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి/రాజన్నసిరిసిల్ల, మార్చి 04

సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీన గ్రామాలకు అందుతున్న కనీస సౌకర్యాల డొల్లతనం మరోసారి బయటపడింది. మున్సిపాలిటీకి పన్నులు చెల్లిస్తున్నా, కనీసం అంత్యక్రియల కోసం ‘వైకుంఠ రథం’ కూడా అందుబాటులోకి రాకపోవడంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఘటన వివరాల్లోకి వెళ్తేసిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు, చిన్న బోనాల నివాసి శ్రీ రేగుల యాదగిరి గారు ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. బుధవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు మున్సిపల్ అధికారులను, సిబ్బందిని వైకుంఠ రథం కోసం పదేపదే కోరినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది. చివరకు గత్యంతరం లేక మృతదేహాన్ని ట్రాక్టర్‌లో ఉంచి శ్మశాన వాటికకు తరలించాల్సిన దుస్థితి ఏర్పడింది.
మా గ్రామాలంటే ఎందుకంత చిన్నచూపు?
ఈ సందర్భంగా 10వ వార్డు నాయకులు బోల్గం వైష్ణవి – నాగరాజు గౌడ్ మాట్లాడుతూ మున్సిపల్ యంత్రాంగంపై నిప్పులు చెరిగారు. “గ్రామాలను బలవంతంగా మున్సిపాలిటీలో విలీనం చేశారు కానీ, సౌకర్యాల కల్పనలో మాత్రం వివక్ష చూపిస్తున్నారు. ఒక మనిషి చనిపోయినప్పుడు ఇచ్చే కనీస గౌరవం కూడా మున్సిపాలిటీ ఇవ్వలేకపోవడం సిగ్గుచేటు. మేము పన్నులు కట్టడం లేదా? లేక ఈ పట్టణ పౌరులం కాదా?” అని వారు ప్రశ్నించారు.
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు
మున్సిపల్ పాలకవర్గం మరియు అధికారులు, విలీన గ్రామాలకు సంబంధించి అంత్యక్రియల కోసం ప్రత్యేకంగా ఒక వైకుంఠ రథాన్ని కేటాయించాలి.10వ వార్డు పరిధిలో వెంటనే ఒక ఆధునిక స్మశాన వాటికను నిర్మించాలి. మున్సిపాలిటీలో అమలు చేస్తున్న ‘101 రూపాయలకే దహన సంస్కారాలు’ పథకాన్ని విలీన గ్రామాల్లోని పేదలకు కూడా వర్తింపజేయాలి.మరణంలోనైనా మనిషికి గౌరవం దక్కాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వార్డు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular