Friday, February 27, 2026
ads
Homeతెలంగాణఘణపురం ప్రాథమిక పాఠశాలకు RO వాటర్ ఫిల్టర్ మరియు ప్లేట్ల బహుకరణ

ఘణపురం ప్రాథమిక పాఠశాలకు RO వాటర్ ఫిల్టర్ మరియు ప్లేట్ల బహుకరణ

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//తొగుట:

ఘణపురం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు తాగునీటి కోసం పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న శ్రీమతి కొత్త వనజ గారు పాఠశాలకు RO వాటర్ ఫిల్టర్ మరియు వాళ్ళ నాన్న గారైన నారాయణరెడ్డి జ్ఞాపకార్థం మధ్యాహ్న భోజన ప్లేట్లను బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ మండల విద్యాధికారి వి.నరసయ్య సార్ గారు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పి.అంజిరెడ్డి సార్ గారు మరియు ఘణపురం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె.అంజలి మేడం గారు అతిథులుగా విచ్చేసి వాటర్ ఫిల్టర్ ను ప్రారంభించి ప్లేట్లను విద్యార్థులకు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా పాఠశాలకు త్రాగునీటి సౌకర్యం కల్పించిన  వనజ మేడం గౌరీ శంకర్ సార్ దంపతులను అభినందించడం జరిగింది. అలాగే పాఠశాలలో హ్యాండ్ వాష్ సౌకర్యం కల్పించిన పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని కూడా అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రకళ   మేడం గారు AAPC చైర్ పర్సన్ లావణ్య గారు ఉపాధ్యాయులు లక్ష్మారెడ్డి, రవీందర్, రాజ్ కుమార్,రవి,పుల్లగూర్ల రామచంద్రా రెడ్డి నవనీత, ప్రేమల గార్లు మరియు CRP వెంకటస్వామి గారు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular