Friday, April 24, 2026
ads
Homeతెలంగాణసిమెంట్ కట్టలు మాయం

సిమెంట్ కట్టలు మాయం

📰 Generate e-Paper Clip

_మట్టపల్లి ఆలయంలో లెక్క చూపని అధికారులు
_ధర్మకర్తలపై అనుమానాలు…
_విచారణ జరపాలంటున్న భక్తులు

మనప్రజాప్రతినిధి హుజూర్ నగర్//మఠంపల్లి

సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం లోని మఠంపల్లి మండల పరిధిలోని మట్టపల్లి యోగ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సిమెంట్ కట్టల బస్తాలు మాయంపై ప్రజలలో చర్చ జరుగుతుంది. ఈ దేవాలయానికి ఓ సిమెంట్ పరిశ్రమ ఇచ్చిన 300 సిమెంట్ కట్టల బస్తాలు మాయమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ఎక్కడ రికార్డులు లేకపోవడం గమనార్హం. పరిశ్రమ వారు మాత్రం తాము సిమెంట్ కట్టలు ఆలయ నిర్వాహకులకు అందించామని చెప్పడం విశేషం. సిమెంట్ కట్టలు ఎక్కడివి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా పరిధిలోని అనకాపల్లిలో నూతనంగా నిర్మించిన నాగార్జున సిమెంట్ పరిశ్రమ ప్రారంభోత్సవం సందర్భంగా మట్టపల్లి యోగా లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సుమారు 300 కు పైగా సిమెంట్ బస్తాలు అందించారు. అయితే ఈ సిమెంట్ కట్టలు అందినట్లు అధికారులు ఎక్కడ రికార్డులో చూపించలేదు. దీంతో వచ్చిన సిమెంట్ కట్టలు ఎటుపోయాయి..!? ఎక్కడున్నాయి..? అసలు రసీదు లేకుండా

ఎందుకు పరిశ్రమ వారు ఎలా వీరికి ఇచ్చారు అనేది ప్రజలలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సిమెంట్ కట్టల మాయం వెనక ధర్మకర్తల పాత్ర ఉందంటూ ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ వ్యవహారాలపై ఇప్పటికే భక్తులు, స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ధర్మకర్తలు ఈ ఆరోపణలపై స్పందించి నిజానిజాలు వెలుగులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు.లేకపోతే సంబంధిత అధికారుల ద్వారా పూర్తి స్థాయి విచారణ జరిపించాలని భక్తులు కోరుతున్నారు.

నాగార్జున సిమెంట్ పరిశ్రమ జీఎం

పరిశ్రమ ప్రారంభం సందర్భంగా ప్రముఖ దేవాలయాలకు సిమెంట్ బస్తాలను పరిశ్రమ తరపున అందించాము. వీటిని ఆ దేవాలయ అభివృద్దికి ఉపయోగప డేలా వాడుకోవాలని అందిస్తాము. అలాగే మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవా లయానికి కూడా 300 కట్టలకు పైగానే పంపించాము. ఈ సిమెంట్ కట్టలను ఆలయ నిర్వహణకు అందజేశాము. మేము ఆ సిమెంట్ కట్టలు ఆలయ నిర్వా హకులకు అందించినట్లు మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి.

సిమెంట్ కట్టలు అందినట్టు ఎక్కడ రికార్డులు లేదు.. ఈవో జ్యోతి

మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ నుండి సిమెంట్ కట్టలు వచ్చినట్లు రికార్డుల పరిశీలిస్తే లేదు. ఎవరైనా సిమెంట్ కానీ ఏదైనా దేవాలయానికి ఇస్తే తమకు అందినట్లుగా రిసీవ్ ఇస్తాము.. కానీ ఈ సిమెంట్ కట్టలు మాకు మా రికార్డులో లేదు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular