📄 ePaper
Saturday, August 22, 2026
Homeతెలంగాణనేడే కల్వకుంట్ల కవిత నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావం

నేడే కల్వకుంట్ల కవిత నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావం

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//హుజూర్‌నగర్

హుజూర్‌నగర్ నుంచి జాగృతి శ్రేణుల భారీ తరలింపు
రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసేలా భావిస్తున్న కల్వకుంట్ల కవిత నాయకత్వంలో ఏర్పాటు కానున్న నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభకు శనివారం హుజూర్‌నగర్ నుంచి జాగృతి శ్రేణులు భారీగా తరలివెళ్లాయి.ప్రత్యేక వాహనాలలో బయలుదేరిన కార్యకర్తలు, మహిళలు,యువత ఉత్సాహభరిత నినాదాలతో  పయనమయ్యారు.ఈ సందర్భంగా జాగృతి నాయకులు మాట్లాడుతూ…తెలంగాణ ఆత్మగౌరవం కోసం, మహిళల సాధికారత కోసం కవిత తీసుకుంటున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకం అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో మహిళా నాయకత్వానికి కొత్త దశ,దిశను చూపించే ప్రయత్నమన్నారు. హుజూర్‌నగర్ పట్టణ మరియు పరిసర గ్రామాల నుంచి వాహనాలలో బయలుదేరిన కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ముందుకు సాగారు.
ఇప్పటి వరకు సామాజిక, సాంస్కృతిక వేదికగా ఉన్న జాగృతి… ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయ రంగంలోకి దిగడం వెనుక స్పష్టమైన లెక్కలున్నాయని ముఖ్యంగా మహిళలు, యువతను లక్ష్యంగా చేసుకుని భారీ స్థాయిలో మోహరించడం… ఇది భావోద్వేగ రాజకీయాల కంటే మించి ఓటు బ్యాంక్ రాజకీయాలకు సంకేతమని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.