Saturday, April 25, 2026
ads
Homeతెలంగాణవిద్యార్థులు చిన్నతనం నుండే ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకోవాలి.

విద్యార్థులు చిన్నతనం నుండే ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకోవాలి.

📰 Generate e-Paper Clip


మనప్రజాప్రతినిధి//హుజూర్ నగర్:

విద్యార్థులు చిన్నతనం నుండే ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకోని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎస్సై మోహన్ బాబు అన్నారు. శనివారం పట్టణంలోని సాయిబాబా థియేటర్ రోడ్డులో ఫోకస్ అకాడమీ 40 రోజుల ప్రయివేట్ శిక్షణ తరగతుల శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మోహన్ బాబు మాట్లాడుతూ విద్యార్థులందరూ వేసవి సెలవుల్లో సమయం వృధా చేయకుండా రోజు రెండు గంటలు వారి యొక్క స్కిల్స్ ను ఇంప్రూవ్ చేసుకొని వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన కొత్త విషయాలు, బేసిక్స్ ,  నేర్చుకోమని చెప్పారు. అలాగే మొబైల్ ఫోన్,టీవీ కీ దూరంగా ఉండాలి అని చెప్పారు.ఈ  కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ పయ్యావుల ప్రకాష్,స్వాతి, గాబుల శ్రీను,  సుధీర్ , ప్రసాద్ , ఉపాధ్యాయులు, విద్యార్థినీ,విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular