ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచన

మనప్రజాప్రతినిధి//కామారెడ్డి

కామారెడ్డి  పట్టణంలో జాతీయ రోడ్డు భద్రత మసోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అలాగే జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అలాగే ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ శిశుమందిర్ స్కూల్ నుండి  నిజాం సాగర్ చౌరస్తా వరకు ర్యాలీగా బయలుదేరి చౌరస్తా వద్ద  విద్యార్థులతో ట్రాఫిక్ పై  అవగాహన కల్పించారు. ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలన్నారు . ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం తాగి వాహనం నడప రాదని, త్రిబుల్ రైడింగ్ చేయరాదని, వెహికల్స్ స్పీడు తగ్గించి నడపాలని, మనం కరెక్ట్ రూట్లో వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై మహేష్, అలాగే ట్రాఫిక్ సిబ్బంది పోలీస్ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.