📄 ePaper
Tuesday, July 28, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఖాజీపూర్ సర్పంచ్‌గాఇండిపెండెంట్అభ్యర్థి కాపర్లబాల్ లక్ష్మిచిరంజీవిఘనవిజయం

ఖాజీపూర్ సర్పంచ్‌గాఇండిపెండెంట్అభ్యర్థి కాపర్లబాల్ లక్ష్మిచిరంజీవిఘనవిజయం

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట్ భూంపల్లిమండలందుబ్బాకనియోజకవర్గం-సిద్దిపేటజిల్లా
పంచాయతీ ఎన్నికల్లో ఖాజీపూర్ గ్రామ సర్పంచ్‌గా ఇండిపెండెంట్ అభ్యర్థి కాపర్ల బాల్ లక్ష్మి చిరంజీవి ఘన విజయం సాధించారు. గ్రామ ప్రజల విశ్వాసంతో భారీ మెజార్టీతో గెలుపొందిన ఆయనకు గ్రామమంతా ఆనందోత్సాహాలతో ఘన స్వాగతం పలికింది.
ఈ సందర్భంగా నూతన సర్పంచ్ కాపర్ల బాల్ లక్ష్మి చిరంజీవి మాట్లాడుతూ,“నన్ను నమ్మి ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్క గ్రామస్తునికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రజల విశ్వాసాన్ని ఎప్పటికీ వృథా చేయను. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తాను. ఖాజీపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం” అని అన్నారు.గ్రామాభివృద్ధి దిశగా పారదర్శక పాలన, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు.గెలుపొందిన సర్పంచ్‌ను గ్రామస్తులు, గ్రామ పెద్దలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular