📄 ePaper
Monday, August 31, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలునిక్కచ్చిగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు

నిక్కచ్చిగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు

📰 Generate e-Paper Clip

సర్పంచ్ ఎన్నికల్లో ప్రలోభాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి హెచ్చరిక
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.నవంబర్ 30.
సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని కఠినంగా అమలు చేస్తూ, ఏ విధమైన ప్రలోభాలకు కూడా తావివ్వకుండా జిల్లా పోలీస్ శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టిందని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి ఒక ప్రకటనలో తెలిపారు.
డీఎస్పీ మాట్లాడుతూ—
గ్రామాల్లో అభ్యర్థులు లేదా వారి అనుచరులు డబ్బు పంచడం, ఓటర్లను ఆకర్షించేందుకు ప్రలోభాలు చూపడం, కుల సంఘాలకు నిధులు ఇవ్వడం, గ్రామాభివృద్ధి పేరుతో డబ్బులు అడగడం లేదా ఆశలు చూపడం వంటి ఏ చర్యలైనా కఠినంగా నిషేధించబడినవేనని, ఇలాంటి చర్యలకు ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం కేసులు నమోదు అవుతాయని స్పష్టంచేశారు.జనాలుఎలాంటిభయభ్రాంతులు లేకుండా, స్వేచ్ఛాయుతంగాతమఓటుహక్కునువినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఎన్నికలప్రక్రియపారదర్శకంగా, శాంతియుతంగా సాగేందుకు జిల్లా సరిహద్దుల వద్ద చెక్ పోస్ట్‌లు, మండలాలవారీగా FST బృందాలను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ కొనసాగుతున్నట్టు డీఎస్పీ పేర్కొన్నారు.


RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.