📄 ePaper
Friday, August 28, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుతృటిలో తప్పిన పెను ప్రమాదం

తృటిలో తప్పిన పెను ప్రమాదం

📰 Generate e-Paper Clip

మన ప్రజాప్రతినిధి / రాజన్న సిరిసిల్ల
నవంబర్ 25

వేములవాడ మున్సిపల్ పరిధిలో జరుగుతున్న డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులు ఈరోజు ఉదయం పెద్ద ప్రమాదం దాటించాయి. ఆగిపోయిన నిర్మాణాలను పరిశీలించేందుకు నాయకులతో కలిసి ఆది శ్రీనివాస్ స్థలాన్ని సందర్శించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
బేస్ ప్లింత్ వద్ద పరిశీలనలు జరుగుతుండగా, ఇంటి బేస్మెంట్ ఒక్కసారిగా కుంగిపోవడం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని క్షణాల్లోనే భయభ్రాంతులకు గురి చేసింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగకుండా అధికారులు, నాయకులు సురక్షితంగా బయటపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో ప్రారంభమైన డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు నాసిరకం పనితనం కారణంగా మధ్యలోనే నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించబడుతున్న తరుణంలో ఈ ప్రమాదం జరగడం స్థానిక జనాల్లో ఆందోళనకు గురిచేసింది.
నిర్మాణ నాణ్యతపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, మరింత పర్యవేక్షణ పెంచాలని ప్రజలు కోరుతున్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.