📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుసూరారం గ్రామం 6వ వార్డు నుండి బి. నవీన్ కుమార్ నామినేషన్

సూరారం గ్రామం 6వ వార్డు నుండి బి. నవీన్ కుమార్ నామినేషన్

📰 Generate e-Paper Clip

సదాశివపేట, నవంబర్ 28 (మన ప్రజాప్రతినిధి)
సూరారం గ్రామం 6వ వార్డు నుండి బి. నవీన్ కుమార్ శుక్రవారం నాడు తన నామినేషన్‌ను దాఖలు చేశారు. జర్నలిస్టు రంగంలో రెండేళ్లుగా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ, పరిష్కారానికి కృషి చేసిన నవీన్ కుమార్ ఇప్పుడు ప్రజాసేవకుడిగా ముందుకు సాగాలనినిర్ణయించుకున్నారు.ఎన్నికలప్రచారంలోభాగంగా మాట్లాడుతూ“ప్రజలు ఆశీర్వదిస్తే మా గ్రామ అభివృద్ధిలో ముందంజగా పని చేస్తాను. ముఖ్యంగా ఎస్సీ కాలనీ అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను,” అని ఆయన అన్నారు.గ్రామంలో మంచి పేరు ప్రఖ్యాతలు గాంచిన నవీన్ కుమార్, ఎవరైనా పిలిచినా, ఎప్పుడు ఫోన్ చేసినాచిన్నా–పెద్దా తేడా లేకుండా అందరికీ సహాయం చేసే వ్యక్తిగా పేరుపొందారు.“మీరు అందరూ కలిసి నాకు ఇచ్చిన ఈ అవకాశం చాలా పెద్ద బాధ్యత. నేను మీ కొడుకులా, అన్నయ్యలా, తమ్ముడిలా ఎప్పుడూమీతోఉంటాను.మావార్డుసమస్యలనుపైఅధికారులదాకాతీసుకెళ్లిపరిష్కరించేందుకుఎప్పుడూసిద్ధంగాఉంటాను.రాత్రిఅయినా, పగలు అయినా, ఏ సమస్య వచ్చినా ఒక ఫోన్ చేస్తే వెంటనే మీ వద్ద ఉంటాను,”అని తెలిపారు.జర్నలిస్టుగా ప్రజలకు సేవలందించిన నవీన్ కుమార్, ఇప్పుడు వార్డు అభివృద్ధి పట్ల మరింత కృషి చేయాలని గ్రామస్తుల ముందుకు వచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.