📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుషాపుల ముందు ధర్నా

షాపుల ముందు ధర్నా

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//

అక్కన్నపేట, నవంబర్ 22:

సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం ధర్మారం గ్రామంలో మహిళలంతా ఏకమై బెల్ట్ షాపుల ముందు ధర్నా నిర్వహించారు. ఊళ్లో బెల్ట్ షాపుల వల్ల మగవాళ్లంతా తాగుబోతులుగా తయారవుతున్నారని, ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారని ఆరోపించారు. ఎన్నిసార్లు చెప్పినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదని వాపోయారు. బెల్ట్ షాపు యజమానులు ఉద్దెర ఇవ్వడం వల్ల, తమకు వచ్చిన కూలి పంట డబ్బులు కూడా అటే వెళ్ళిపోతున్నాయని తెలియజేశారు. ఈ విషయం పై ఎక్స్చేంజ్ అధికారులకు విన్నవిస్తే, కనీసం పట్టించుకోవడం లేదన్నారు. మీరు చక్కగా ఉంటే మీ భర్తలు చక్కగా ఉంటారంటూ కించపరిచేల మాట్లాడరని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు కూలి చేసి పిల్లల్ని సాకుతున్నామని, భూములు అమ్ముకునే పరిస్థితి కూడా వస్తోందని కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామంలో బెల్ట్ షాపులను పూర్తిగా తొలగించాలని గ్రామపంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం అందించారు. దీనిపై ఎక్సైజ్ అధికారులు స్పందించి బెల్ట్ షాపులను తొలగించకపోతే గ్రామమంతా కదిలి, హుస్నాబాద్ ఎక్సైజ్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.