సవ్యాంగులకు దీటుగా దివ్యాంగుల ప్రతిభ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య
సంగారెడ్డి, నవంబర్ 29:,(మనప్రజాప్రతినిధి):
దివ్యాంగులు సవ్యాంగులకు దీటుగా అన్ని రంగాలలో తమ ప్రతిభను చాటుతున్నారని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు.
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో మహిళా, శిశు,వికలాంగుల, మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య క్రీడాపోటీలనుప్రారంభించిపాల్గొన్నవారికిశుభాకాంక్షలుతెలియజేశారు.ఈసందర్భంగాకలెక్టర్మాట్లాడుతూ,దివ్యాంగులు సవ్యాంగులకు ఏమాత్రం తీసిపోకుండా అన్ని రంగాలలో అద్భుత ప్రతిభను కనబరుస్తున్నారని అన్నారు. వికలాంగత విజయానికి అడ్డు కాదని, పట్టుదల ఆత్మవిశ్వాసంతో అనుకున్నది సాధించాలని ఉద్బోధించారు. ప్రభుత్వం అందరి కోసం సమాన అవకాశాలు, సదుపాయాలు కల్పించేందుకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు. క్రీడలు దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు వారిలోని ప్రతిభను వెలుగులోకి తెస్తాయని అన్నారు.కార్యక్రమంలో వివిధ క్రీడా విభాగాల్లో జిల్లా వ్యాప్తంగా వచ్చిన దివ్యాంగులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. వీరికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రన్నింగ్, షాట్‌పుట్, వీల్‌చెయిర్ రేస్, ఇండోర్ గేమ్స్ తదితర విభాగాల్లో పోటీలు జరిగాయి. ఆయా పోటీలను కలెక్టర్ ప్రత్యేకంగా దగ్గరుండి పరిశీలించడంతోపాటు క్రీడాకారులను ప్రోత్సహించారు.
అనంతరం విజేతలకు బహుమతులు అందజేసారు.ఈకార్యక్రమంలో డి డబ్ల్యు ఓలలిత కుమారి, యువజన సంక్షేమ శాఖ అధికారి ఖాసిం బే గ్ , జిల్లా వైద్యఆరోగ్యశాఖఅధికారిడా.ఎం.వసంత్‌రావు,అధికారులు, కోచ్‌లు, వాలంటీర్లు,దివ్యాంగులు,జిల్లా దివ్యాంగుల అసోసియేషన్ ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.
విజయానికి వికలాంగత అడ్డు కాదు
RELATED ARTICLES

