📄 ePaper
Wednesday, July 15, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుడ్రైసీడ్ ట్రీట్మెంట్‌పై తోర్నాలలో వ్యవసాయ విద్యార్థుల శిక్షణ కార్యక్రమం

డ్రైసీడ్ ట్రీట్మెంట్‌పై తోర్నాలలో వ్యవసాయ విద్యార్థుల శిక్షణ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

•కార్బెండాజిమ్”వినియోగంపైరైతులకు ప్రత్యక్ష మార్గదర్శనం
సిద్దిపేటనియోజకవర్గం.ఫిబ్రవరి26(మనప్రజాప్రతినిధి):
తొర్నాలగ్రామంలోడ్రైసీడ్”ట్రీట్మెంట్ పద్ధతిపైబాబుజగ్జీవన్ రాం కాలేజీ అఫ్ అగ్రికల్చర్ విద్యార్థులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.గ్రామీణ వ్యవసాయ అనుభవంలో భాగంగా చేపట్టిన ఈ శిక్షణ రైతులకు శాస్త్రీయ వ్యవసాయ విధానాలపై స్పష్టతనిచ్చింది.
ప్రతి కిలో విత్తనానికి మూడు గ్రాముల కార్బెండాజిమ్‌ను డ్రై పద్ధతిలో కలిపి విత్తన శుద్ధి చేయాలని విద్యార్థులు ప్రదర్శించారు. ఔషధాన్ని సమానంగా కలపడం ద్వారా విత్తనాలు రోగ నిరోధక శక్తిని పొందుతాయని వివరించారు.విత్తన శుద్ధి వల్ల ఫంగల్ వ్యాధులు తగ్గిపోవడం,మొలక శాతం మెరుగుపడటం, మొక్కల ప్రారంభ దశలో రక్షణ కలగడం,తద్వారా దిగుబడి పెరగడం వంటి ప్రయోజనాలను రైతులకువివరించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు విద్యార్థుల ప్రదర్శనను అభినందిస్తూ, భవిష్యత్తులో సూచించిన విధానాలను అమలు చేస్తామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular