📄 ePaper
Tuesday, July 14, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలులింగాల గ్రామంలో యువకుడిపై దాడి న్యాయం చేయాలని బాధితుడి విజ్ఞప్తి

లింగాల గ్రామంలో యువకుడిపై దాడి న్యాయం చేయాలని బాధితుడి విజ్ఞప్తి

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//పెన్పహాడ్ మండలం, లింగాల గ్రామం:

లింగాల గ్రామానికి చెందిన దాచేపల్లి నగేష్, ఆయన కుమారుడు దాచేపల్లి వంశీ తనపై దాడి చేశారని రణపంగ శ్రవణ్ ఆరోపించారు.బాధితుడు రణపంగ శ్రవణ్ తెలిపిన వివరాల ప్రకారం, నిన్న గ్రామ చెరువు వద్ద తనపై దాడి జరిగిందని, ఈ ఘటనలో స్వల్ప గాయాలయ్యాయని చెప్పారు. అనంతరం పెన్పహాడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందగా, గొంతు నొప్పి, వాపు ఉండటంతో వైద్యులు సీటీ స్కాన్ (CT Scan) చేయించాలని సూచించినట్లు తెలిపారు.ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు శ్రవణ్ వెల్లడించారు. తనపై జరిగిన దాడి డబ్బు, కుల అహంకారంతో జరిగిందని ఆయన ఆరోపించారు.
ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పెన్పహాడ్ మండలం ఎస్సై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి తనకు న్యాయం చేయాలని కోరారు. తన ప్రాణానికి ముప్పు ఉందని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అదేవిధంగా ఈ విషయాన్ని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు తెలియజేసినట్లు తెలిపారు. మండలంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు తనకు మద్దతుగా నిలవాలని కోరుతూ, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు తన పోరాటం కొనసాగుతుందని రణపంగ శ్రవణ్ స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular