📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుస్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ

స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ

📰 Generate e-Paper Clip

సిద్దిపేటలో పాల్గొన్న ఎమ్మెల్యే హరీష్ రావు

మనప్రజాప్రతినిధి// సిద్దిపేట, నవంబర్ 25


సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి. హరీష్ రావు పాల్గొని ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

హరీష్ రావు వ్యాఖ్యలు:

“కేసీఆర్ ప్రభుత్వంలో బతుకమ్మ పండుగకు 1 కోటి 30 వేల మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
కానీ ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం 46 లక్షల మహిళలకు మాత్రమె చీరలు ఇస్తోంది.సిద్దిపేట జిల్లాలో 3,83,000 మహిళలు ఉండగా కేవలం 1,99,000 మందికే చీరలు రావడం అన్యాయం అన్నారు.

“ఒక్క సంవత్సరం — ఒక్క చీర… దానితో సారే పెట్టిన అంటున్నారు!
సర్పంచ్ ఎన్నికల్లో కూడా చీరలతో ఓట్లు కొట్టమంటారా?” అని ప్రశ్నించారు.

మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకూ అమలు చేయకపోవడాన్ని ఆయన ఖండించారు.

“రెండు చీరలు ఇస్తామని చెప్పి ఒకటే ఇచ్చారు… ఇలా చేస్తే మహిళలు ఎందుకు ఓటేయాలి?” అన్నారు.
పట్టణ ప్రాంతాలపై అన్యాయం:

పట్టణాల్లో చీరలు లేవు… వడ్డీలేని రుణాలు లేవు…
“ఎందుకంటే పట్టణాల్లో ఎన్నికలు లేవు కనుకే ఈ నిర్లక్ష్యం” అని అన్నారు.
స్త్రీనిధి – బస్సులు – పవర్ ప్రాజెక్టులు:

మహిళా సంఘాలు 25 వేల కోట్ల రుణాలు తీసుకుంటే ప్రభుత్వం కేవలం 5 వేల కోట్లకు మాత్రమే వడ్డీలేని రుణం ఇస్తోందని చెప్పారు.
“20 పైసలు ఇస్తూ 80 పైసలు ఎగబడుతున్న ప్రభుత్వం ఇది” అని ఆరోపించారు.

“గతంలో స్త్రీనిధి కింద వడ్డీలేని రుణాలు ఇచ్చాము… కానీ ఇప్పుడు స్త్రీనిధికి కూడా వడ్డీతోనే రుణాలు ఇస్తున్నారు.
అసెంబ్లీలో మీ కోసం పోరాడుతాను” అన్నారు.

మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు ఇస్తామని చెప్పి, సిద్దిపేట జిల్లాకు ఒక్క బస్సు కూడా ఇవ్వలేదని విమర్శించారు.

వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఇస్తామని చెప్పి—
“రెండు సంవత్సరాలు అయినా ఇప్పటికి ఒక్క మెగావాట్ కూడా పెట్టలేదు” అని ధ్వజమెత్తారు.

“ఓట్ల కోసం చేసే సంక్షేమం ఇది” – హరీష్ రావు

హరీష్ రావు చివరిగా మాట్లాడుతూ:

“కేసీఆర్ పండుగ పండుగకు సంక్షేమం ఇచ్చాడు…
రేవంత్ రెడ్డి మాత్రం ఓటు ఓటుకే సంక్షేమం ఇస్తున్నాడు.
రైతుబంధు ఓట్లకే…
చీరల పంపిణీ ఓట్లకే…
వడ్డీలేని రుణాలు ఓట్లకే…
రుణ మాఫీ సగం ఇచ్చి… సగం ఎగొట్టాడు.
ఆశపెట్టడం… ఆయాస పెట్టడం… మభ్య పెట్టడం… మోసం చేయడం — ఇవే ఈ ప్రభుత్వానికి అలవాటు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.