Friday, February 27, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలునేడే పాపన్నపేటలో జూనియర్ కబడ్డీ సెలక్షన్స్ – జిల్లా వ్యాప్తంగా ఆసక్తి పెరిగిన క్రీడాకారులు

నేడే పాపన్నపేటలో జూనియర్ కబడ్డీ సెలక్షన్స్ – జిల్లా వ్యాప్తంగా ఆసక్తి పెరిగిన క్రీడాకారులు

📰 Generate e-Paper Clip

పాపన్నపేట,నవంబర్29:(మనప్రజాప్రతినిధి)

మెదక్ జిల్లా పాపన్నపేట మండల కేంద్రంలో ఈ నెల 30న జూనియర్ బాలబాలికల కోసం కబడ్డి ఎంపిక పరీక్షలు నిర్వహించబోతున్నాయి. ఈ అవకాశానికి మెదక్ జిల్లాక్రిడాకారులుఆసక్తిగాఎదురుచూస్తున్నారు. మెదక్ జిల్లా కబడ్డి అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ సెలక్షన్‌లను జిల్లా కబడ్డి అసోసియేషన్ ప్రధానకార్యదర్శిపోల్కంపేటరమేష్ అధికారికంగా ప్రకటించారు.ఈ ఎంపికల్లో మెదక్ జిల్లా ప్రతిభావంతులైన యువ కబడ్డి క్రీడాకారులు పొద్దున్నపోగా రాష్ట్ర స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరచేందుకు సన్నాహాలు అవుతాయన్నారు.20సంవత్సరాలలోపు బాలురు, బాలికలు ఈ ఎంపికల్లో పాల్గొనవచ్చని వివరింపబడింది. క్రీడా శైలి, శారీరక నైపుణ్యం, చురుకుదనం, మ్యాచ్ సమయంలో తక్షణ నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాల ఆధారంగా ఎంపిక జరుగుతుందని చెప్పారు.ఎంపికలో పాల్గొనే క్రీడాకారులు క్రీడా దుస్తులు, గుర్తింపు ఆధారాలు (ఐడి ప్రూఫ్)తో ఉదయం నిర్ణీత సమయానికి హాజరుకావాల్సి ఉందని, క్రమశిక్షణ మరియు క్రీడాస్ఫూర్తిని బాగా పాటించడం అవసరమని పోలీసీ ఆసోసియేషన్ కార్యదర్శి పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9010735121 లేదా 9989175382 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular