Friday, February 27, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలువరంగల్ అభివృద్ధి పనులపై కిషన్ రెడ్డి సమీక్ష

వరంగల్ అభివృద్ధి పనులపై కిషన్ రెడ్డి సమీక్ష

📰 Generate e-Paper Clip

ప్రధాన కేంద్ర ప్రాజెక్టుల పురోగతిపై స్పష్టమైన దిశా నిర్ధేశం
భద్రకాళి దేవాలయం వద్ద టూరిజం అభివృద్ధి పరిశీలన
మమ్మనూరు ఎయిర్‌పోర్ట్ భూమి సేకరణపై దృష్టి
రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ & టెక్స్టైల్ పార్క్ పురోగతిపై సమీక్ష
వరంగల్, నవంబర్ 29 (మనప్రజాప్రతినిధి):
ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, అలాగే టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ అధికారులతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హరిత ప్లాజాలో సమావేశమై వరంగల్‌కు సంబంధించిన కీలక అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. అనంతరం కాజీపేటలోని రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను సందర్శించి అక్కడి పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించారు. భద్రకాళి దేవాలయం పరిసరాల్లో పర్యాటక వసతుల విస్తరణ, అభివృద్ధి పనులపై మంత్రి విపులంగా చర్చించారు. ప్రాంతీయ పర్యాటక రంగం మరింత బలోపేతం కావడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అధికారులకు వివరించారు. మమ్మనూరు విమానాశ్రయానికి భూసేకరణ ప్రక్రియలో ఎదురైన సమస్యలను పరిష్కరించి వేగవంతం చేయాలని సూచించారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌, కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ వంటి భారీ కేంద్ర ప్రాజెక్టుల పురోగతిని మంత్రి సమీక్షిస్తూ, నిర్ణీత గడువులో పనులు పూర్తి కావాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టులు ప్రాంతీయ ఉపాధికి, పరిశ్రమల వృద్ధికి కీలక మద్దతు ఇస్తాయని ఆయన గుర్తు చేశారు.అదేవిధంగా, వేలిస్థంభాల దేవాలయం అందచందాలను పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వరంగల్‌ను చారిత్రక, పర్యాటక, పారిశ్రామిక నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular