📄 ePaper
Thursday, August 27, 2026
Homeతెలంగాణదళిత మహిళలను అడ్డుపెట్టుకుని దాడి చేయించిన వ్యక్తి అరెస్ట్

దళిత మహిళలను అడ్డుపెట్టుకుని దాడి చేయించిన వ్యక్తి అరెస్ట్

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//కొండపాక మండల్:

వ్యక్తిగత కక్షలను మనసులో పెట్టుకొని ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్న ఓ వ్యక్తి  దళిత మహిళలను అడ్డుపెట్టుకొని ఓ వ్యక్తిపై దాడి చేయించిన వ్యక్తిని త్రీటౌన్ పోలీసులు గురువారం రాత్రి అరెస్టు చేశారు. త్రీ టౌన్ సిఐ విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం…. దుద్దెడ గ్రామానికి చెందిన దోమల ఐలయ్య అలియాస్ అరుణ్ యాదవ్ అదే గ్రామానికి చెందిన జక్కుల రాజు అనే వ్యక్తిపై కక్ష కట్టాడు. ఎలాగైనా రాజు పై పోలీసు కేసు అయ్యేలా, గ్రామంలో అతని పరువు పోయేలా చేయాలని పథకం పన్నాడు. దోమల ఐలయ్య కొద్ది రోజుల క్రితం సిద్దిపేట పట్టణానికి చెందిన నాగమణి అనే దళిత మహిళతో పాటు మరో నలుగురికి డబ్బులు ఇచ్చి దుద్దెడ గ్రామంలో రాజు నడుపుకునే ఆన్లైన్ కమ్యూనికేషన్స్ దుకాణంలోకి వెళ్లి గొడవ ప్రారంభించారు. ఈ అయోమయంలో నుంచి రాజు తేరుకోక ముందే రాజు తమపై దాడి చేశాడనీ, అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ పథకం ప్రకారం వచ్చిన మహిళలు దాడికి పాల్పడ్డారు. స్థానికులు అడ్డుకున్న మహిళలు రాజు పై దాడి చేస్తూనే ఉండడంతో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు వచ్చి గొడవ సద్దుమణగా చేసినప్పటికీ సదర్ మహిళలు త్రి టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలంటూ రాజు పై ఫిర్యాదు చేశారు. ప్రత్యక్ష సాక్షులను వెంట తీసుకువెళ్లి నా బాధితుడు రాజు సీపీకి జరిగిన విషయాన్ని వివరించారు. పూర్తిస్థాయి దర్యాప్తు చేసి కేసు నమోదు చేయాలని పోలీస్ కమిషనర్ ఆదేశాలతో సీఐ విద్యాసాగర్ విచారణ జరిపి దోమల ఐలయ్య కక్షపూరితంగా రాజు పై మహిళలతో దాడి చేయించినట్లుగా నిర్ధారణ చేశారు. ఈ మేరకు రాజు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐలయ్యను బుధవారం రాత్రి అరెస్టు చేశారు. గ్రామంలో అనేక వివాదాలకు కారకుడుగా నిలిచే ఐలయ్య పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.