మనప్రజాప్రతినిధిన్యూస్,సత్తుపల్లి నవంబర్ 17 :
సత్తుపల్లి సింగరేణి జెవిఆర్ ఓసి- 2 లో సోమవారం నాడు సింగరేణి సి ఎం డి బలరాం మార్గ నిర్దేశంతి మరియు సత్తుపల్లి జిఎం చింతల శ్రీనివాస్ ఆదేశాల మేరకు విశ్రాంత భవనం నందు మిషన్ హెల్తి ప్రాచీన యోగ దినచర్య కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ సిహెచ్. శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులందరూ ఆరోగ్యంగా ఉంటేనే సంస్థలో రక్షణ ఉత్పత్తి ఉత్పాదకత బాగుంటుందని దీనిలో భాగంగా ప్రాచీన యోగా దినచర్యను ఏర్పాటు చేయడమైనదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యోగ ట్రైనర్ షణ్ముఖ శివచంద్ర ఉద్యోగులకు ఆరోగ్యం మరియు పురాతన యోగ జీవనశైలి పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఏరియా జిఎం చింతల శ్రీనివాసరావు, జి.వి.ఆర్ ఓసి- 2 ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎన్ వి ఆర్ ప్రహ్లాద్, కిష్టారం ఓసి ప్రాజెక్టు ఆఫీసర్ సునీల్ వర్మ, హెచ్ ఓ డి జేవి ఆర్ ఓసి హెచ్ పి కే.సోమశేఖర్, జెవీఆర్ఓసి కిష్టారం ఓసి ప్రాజెక్టు ఇంజనీర్లు డి. శ్రీనివాసరావు జి. వెంకటేశ్వర్ రావు, యోగ ట్రైనర్ షణ్ముఖ శివచంద్ర, జెవిఆర్ ఓసి ఎస్ ఓ ఎం బి.రాజేశ్వరరావు కిష్టారం ఎస్ ఓ ఎం బి రామకృష్ణ, వెల్ఫేర్ ఆఫీసర్లు ధార కావ్య, కే. శ్రీనివాస్, ఐ ఎన్ టి యు సి నాయకులు నాగ ప్రకాష్ ,ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ సుధాకర్ మరియు ఇతర డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి జెవిఆర్ ఓసి లో మిషన్ హెల్తీ ప్రాచీన యోగ దినచర్య కార్యక్రమం
RELATED ARTICLES

