సదాశివపేట, నవంబర్ 24 (మన ప్రజా ప్రతినిధి):
సదాశివపేట మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్–2025 లో ప్రథమ స్థానం సాధించిన జీనియస్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థులు రోహన్ రెడ్డి, తహేర యూసుఫ్, ఖాజా మొయినుద్దీన్లను సంగారెడ్డి ఎమ్మెల్యే శ్రీ చింతా ప్రభాకర్ శనివారం క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సన్మానించారు.
మండల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు పాల్గొన్న ఈ పోటీలో జీనియస్ స్కూల్ విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలవడం పట్ల ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. అలాగే రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ విజేతగా నిలిచిన, ఉమ్మడి మెదక్ జిల్లా టీమ్‌లో సభ్యురాలు, జీనియస్ విద్యార్థిని యూ. అక్షరను కూడా ఎమ్మెల్యే ప్రత్యేకంగా సన్మానించారు.
జీనియస్ స్కూల్ విద్యార్థులు అన్ని రంగాలలో ప్రతిభ చాటుతూ రాష్ట్రస్థాయి విజయాలు సాధించడం పాఠశాలకు గౌరవకారకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్య సభ్యులు చైర్మన్ ముద్ద నాగనాథ్, వైస్ చైర్మన్ కూచి శ్రీనివాస్, కరెస్పాండెంట్ రఘువర్ధన్ రెడ్డి, డైరెక్టర్ అమరేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రీతి, ఉపాధ్యాయులు జ్ఞానేశ్వర్, ఉమారాణి, రాణా ప్రతాప్, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
సదాశివపేట చెకుముకి టాలెంట్ టెస్ట్ విజేతలను సన్మానించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
RELATED ARTICLES

