మెదక్,మనప్రజాప్రతినిధి//నవంబర్ 30.
అల్లాదుర్గం మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ చివరి రోజు శనివారం ప్రశాంతంగా సాగింది. ఉదయం10:30 గంటలనుంచిమండలపరిధిలోనిఅన్నిగ్రామాలకుచెందినసర్పంచ్,వార్డ్మెంబర్ అభ్యర్థులు డప్పు వాయిద్యాలతో భారీ ర్యాలీల రూపంలో వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు.మండలంలోనిసర్పంచ్అభ్యర్థులు మొత్తం – 99 మంది, అలాగే వార్డు సభ్యుల అభ్యర్థులు మొత్తం329 మంది నామినేషన్లు వేసినట్లుఅధికారులుతెలిపారు.సాయంత్రం 5 గంటల వరకు వచ్చిన వారికి టోకెన్లు జారీ చేసి, ఆ టోకెన్ క్రమానుసారం రాత్రి 12 గంటల వరకు నామినేషన్ ప్రక్రియకొనసాగిందని ఎంపీడీవో వేమన ప్రశాంత్ రెడ్డివెల్లడించారు.నామినేషన్ దాఖలు మొత్తం ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
ప్రశాంత వాతావరణంలో నామినేషన్లు పూర్తి.
RELATED ARTICLES

