📄 ePaper
Friday, August 28, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుపూలే జ్యోతి చిరస్థాయి — ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ నివాళులు

పూలే జ్యోతి చిరస్థాయి — ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ నివాళులు

📰 Generate e-Paper Clip

మన ప్రజాప్రతినిధి — అక్బర్ పేట మండలం
దుబ్బాక నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా.
మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా భూంపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ–ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవ శ్రీ బక్కి వెంకటయ్య మహనీయుల విగ్రహాలకు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా చైర్మన్ వెంకటయ్య మాట్లాడుతూ—సమాజంలో అంటరానితనం, కులవివక్ష, సామాజిక అన్యాయం నిర్మూలనకై మహాత్మ పూలే చేసిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు. అణగారిన వర్గాలు, ముఖ్యంగా దళిత–బహుజనుల విద్యాభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహా సంస్కర్తగా పూలే దంపతులు చరిత్రలోనిలిచిపోయారనిగుర్తుచేశారు.మహిళలకు విద్యా అవకాశాలను తెరచిన తొలి సంఘసంస్కర్తలుగా సావిత్రిబాయి పూలేను స్మరించారు.కార్యక్రమంలో చైర్మన్ వెంకటయ్యతో పాటుజన్నారెడ్డి, బోయ శ్రీనివాస్, బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు దోమకొండ నర్సింలు, మాజీ వార్డ్ సభ్యులు బొల్లు స్వామి, మాజీ ఉపసర్పంచ్ పర్స స్వామి, పూలే కమిటీ అధ్యక్షులు కుమ్మరి రాజు, సుందరి రాజి రెడ్డి, జంగం నాగరాజు, రాచకొండ రమేష్, ప్రవీణ్, ఉడిది నర్సింలు, పర్స ప్రవీణ్, రంజిత్, రమేష్, రాజు, వెంకటి, బొట్ట రాజు, షాబుద్ధీన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.