Friday, February 27, 2026
ads
Homeఫ్యాషన్కొత్త లుక్బీస్ట్ మోడ్‌లో సమంత..

బీస్ట్ మోడ్‌లో సమంత..

📰 Generate e-Paper Clip

కొత్త ఫిట్‌నెస్ లక్ష్యంతో మరోసారి ట్రెండింగ్

హైదరాబాద్‌, నవంబర్‌ 22, మనప్రజాప్రతినిధి:

టాలీవుడ్ స్టార్ నటి సమంత రూత్ ప్రభు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న ఆమె జిమ్‌లో తన వర్కౌట్ సెషన్స్‌కి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో అవి నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలో బ్యాక్, ఆర్మ్స్ మసిల్స్‌ను ఫ్లెక్స్ చేస్తూ కనిపించిన సమంత ఫిట్‌నెస్ ట్రాన్స్‌ఫార్మేషన్ అభిమానులను ఆకట్టుకుంటోంది. గ్రే స్పోర్ట్స్ బ్రా, నేవీ లెగింగ్స్, వైట్ స్నీకర్స్‌లో ఆమె అథ్లెటిక్ లుక్‌కి సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన లభిస్తోంది.
కొద్ది గంటల్లోనే ఈ ఫోటోలకు లక్షల్లో లైకులు, వేలాది కామెంట్లు వచ్చాయి. “సామ్ ఈజ్ బ్యాక్”, “బీస్ట్ మోడ్ ఆన్”, “ఇంత స్ట్రాంగ్ లుక్ ఇంతకు ముందు చూడలేదు” అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం మయోసైటిస్‌తో బాధపడి, శారీరకంగా చాలా వీక్‌గా మారిన సమంత ఇప్పుడు క్రమంగా కోలుకుని, మళ్లీ పూర్తి శక్తితో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టిందన్న విషయం అభిమానులకు మరింత ఉత్సాహం ఇస్తోంది.
ఇదిలా ఉండగా, ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ది ఫ్యామిలీ మాన్ సీజన్ 3’ హిట్ కావడంతో సమంత మరోసారి చర్చల్లోకి వచ్చింది. ఈ సిరీస్‌కు వచ్చిన పాజిటివ్ రివ్యూలను ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ, చాలా రోజుల తర్వాత ఇంతగా ప్రశంసలు రావడం సంతోషంగా ఉందని పేర్కొంది. సీజన్ 2లో కీలక పాత్ర పోషించిన సమంత, కొత్త సీజన్‌లోనూ కథనం, ఎమోషన్స్, రియలిస్టిక్ ప్రెజెంటేషన్‌ను రాజ్ & డీకే టీమ్ తీసుకువెళ్లిన తీరును ప్రశంసించింది.
హై ఇంటెన్సిటీ డ్రామా, పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాలు, సహజమైన నటనతో ఈ సిరీస్ మరోసారి తన స్థాయిని నిరూపించుకున్న నేపథ్యంలో సమంతపై మళ్లీ టాక్ పెరిగింది. తన ఫిట్‌నెస్ ఫోటోలు, ఓటీటీ విజయం, కొత్త సినిమాల అప్‌డేట్స్‌తో సమంత ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అభిమానులు ఆమె ‘మా ఇంటి బంగారం’ చిత్రం విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, ఆమె తదుపరి ప్రాజెక్టులు ఏంటి, ఫిట్‌నెస్ జర్నీ ఎలా కొనసాగుతుందో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular