– ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన తుపాను వాహనం
– నలుగురు అక్కడికక్కడే మృతి
– మరో ఆరుగురు తీవ్రంగా గాయపాటు
ఎత్తురాళ్లపాడు (శ్రీకాకుళం), 23 నవంబర్ (మనప్రజాప్రతినిధి):
ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం వేకువ జామున జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఎత్తురాళ్లపాడు వద్ద ఆగి ఉన్న లారీని తుపాను వాహనం ఢీకొట్టడంతో నలుగురు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. వేకువ జామున 3 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.
శ్రీశైలం దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మృతులను మధ్యప్రదేశ్‌కు చెందిన సింగ్ పవార్ (63), విజయ్ సింగ్ తోమర్ (65), కుశాల్ సింగ్ (62), సంతోషిబాయి (62)గా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు.
శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం
RELATED ARTICLES

