📄 ePaper
Thursday, July 16, 2026
Homeతెలంగాణఎప్పటికీ మరచిపోలేని గొప్ప నాయకుడు మదన్మోహన్

ఎప్పటికీ మరచిపోలేని గొప్ప నాయకుడు మదన్మోహన్

📰 Generate e-Paper Clip

_మాజీ మంత్రి కీశే మదన్మోహన్ గారు చేసిన కృషి మరువలేనిది
_సిద్ధిపేట కీర్తిని ఢిల్లీకి చాటిచెప్పిన మహోన్నతమైన నాయకుడు
_సిద్ధిపేట ప్రాంత ప్రజలకు 30 వేలకు పైగా ఉపాధి కల్పించిన మహనీయుడు
_రాబోయే తరాల వారు మదన్మోహన్  ఆశయాలను ముందుకు సాగాలి
_ముస్తాబాద్ చౌరస్తా వద్ద మదన్మోహన్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం
_మదన్మోహన్ గారి జయంతి సందర్భంగా సిద్ధిపేట పట్టణంలో అన్నదాన కార్యక్రమం సేవ కార్యక్రమాలు
_సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పూజల హరికృష్ణ గారు పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ 

మనప్రజాప్రతినిధి//సిద్ధిపేట,నవంబర్ 16:


ఎప్పటికీ మరచిపోలేని గొప్ప నాయకుడు మదన్మోహన్ గారు అని ఆయన ఎల్లప్పుడూ సిద్ధిపేట నియోజకవర్గ ప్రజల గుండేల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు అని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పూజల హరికృష్ణ గారు పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ గారు అన్నారు. సిద్ధిపేటలో మాజీ మంత్రి కిశే కాంగ్రెస్ పార్టీ నాయకుడు మదన్మోహన్ గారి జయంతి సందర్భంగా ఆదివారం సిద్ధిపేట పట్టణంలో పట్టణ కాంగ్రెస్ అత్తు ఇమామ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మదన్మోహన్ గారి ప్రియ శిష్యుడు మార్క్ సతీశ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం సేవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పూజల హరికృష్ణ గారు పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ మార్గ సతీష్ గౌడ్ గారు మాట్లాడుతూ సిద్ధిపేట కీర్తిని ఢిల్లీకి చాటిచెప్పిన మహోన్నతమైన నాయకుడు మదన్మోహన్ అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని సిద్దిపేట నుంచి ఉద్యమం ప్రారంభించారు అని అన్నారు. మాజీ మంత్రి కీశే మదన్మోహన్ గారు చేసిన కృషి మరువలేనిది అని సిద్ధిపేట అభివృద్ధికి పునాది వేసి తనదైన శైలిలో పాటు పడ్డారు అని అన్నారు. సిద్ధిపేట ప్రాంత ప్రజలకు 30 వేలకు పైగా ఉపాధి కల్పించిన మహనీయుడు అని ఆయన దగ్గరికి ఉపాధి కావాలని వెళ్లితే తప్పకుండా సహాయం చేసే గొప్ప మనస్సు కలిగియున్న నాయకుడు అని అన్నారు. అలాంటి నాయకుడు మన మధ్య లేకపోవడం దురదృష్టకరం అని మనం అందరంతో పాటు రాబోయే తరాల వారు మదన్మోహన్ గారి ఆశయాలను ముందుకు తీసుక్ వెళ్ళాలి అని అన్నారు. త్వరలోనే ముస్తాబాద్ చౌరస్తా వద్ద మదన్మోహన్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం అని చౌరస్తాకు మదన్మోహన్ గారి చౌరస్తా గా ఏర్పాటు చేస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముద్దం లక్ష్మి సఖి ఆనంద్ గంప మహేందర్ రావు గంప వేణు చాంద్ మియా కళీముద్దీన్ గయాసుద్దీన్.అర్షద్. వహాబ్ బబ్బూ ఇమ్రాన్ అలీ. విజయ్ దానిలా.రషద్.రజనీ. సంతోషి. సనా. నర్సవ. భవాని బీజాన్ బి. తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular