Friday, February 27, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి సాదర వీడ్కోలు.....

సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి సాదర వీడ్కోలు…..

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా కలెక్టర్, నవంబర్15,:

జిల్లా రెండు రోజుల పర్యటన ముగించుకుని రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు పయణమైన గౌ. భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి సాదర వీడ్కోలు శ్రీ వేంకటేశ్వర స్వామి జ్ఞాపిక అందించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటన ముగించుకుని నేటి శనివారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు పయనమైన గౌరవ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ కి సాదర వీడ్కోలు లభించింది. హైకోర్టు రిజిస్ట్రార్ పార్థసారథి, చిత్తూరు జిల్లా ఉమ్మడి డిస్టిక్ జడ్జి అరుణ సారిక, తిరుపతి మూడవ అదనపు జిల్లా జడ్జి గురునాథ్,  జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్షి, శ్రీకాళహస్తి ఆర్డిఓ భాను ప్రకాష్ రెడ్డి, తదితరులు గౌ. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కి సాదర వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా గౌ. భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్  ఎంతో ప్రసిద్ధి గాంచిన ఏర్పేడు మండలం మాధవమాల ఉడ్ కార్వింగ్ ఆర్టిజాన్ క్లస్టర్ నందు తయారు చేయబడిన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమ జ్ఞాపికను అందించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular