Friday, February 27, 2026
ads
Homeతెలంగాణపెరుగుతున్న యూపీఐ మోసాలు

పెరుగుతున్న యూపీఐ మోసాలు

📰 Generate e-Paper Clip

తెలంగాణ పోలీస్ కీలక హెచ్చరికలు
హైదరాబాద్, 25 నవంబర్ 2025 (మనప్రజాప్రతినిధి):
డిజిటల్ లావాదేవీల వినియోగం పెరిగిన నేపథ్యంలో యూపీఐ మోసాలు కూడా వేగంగా పెరుగుతున్నాయని తెలంగాణ పోలీస్ హెచ్చరించింది. గుర్తు తెలియని కంటాక్టులకు డబ్బు పంపే ముందు వారి యూపీఐ ఐడిని ఒకసారి కచ్చితంగా చెక్ చేయాలని సూచించింది. చిన్న పొరపాటు పెద్ద ఆర్థిక నష్టానికి దారితీయవచ్చని అధికారులు స్పష్టం చేశారు.
యూపీఐ పిన్ వంటి వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని పోలీసులు హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు పంపించే లింకులు, మెసేజ్‌లు, క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోతున్న కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. బ్యాంక్‌ లావాదేవీలను తరచూ తనిఖీ చేయడం వలన మోసాలను ముందుగానే గుర్తించే అవకాశం ఉందని తెలిపారు.
అవాంఛిత లావాదేవీలు గమనించిన వెంటనే యూజర్లు వెంటనే అప్రమత్తం కావాలని, ముఖ్యంగా సైలెంట్ గా వెళ్లే ఆటో డెబిట్‌లను గమనించాల్సిన అవసరం ఉందని పోలీసులు సూచించారు. బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, మెసేజ్‌లు, నోటిఫికేషన్‌లను సక్రమంగా చూడడం చాలా అవసరమన్నారు.
యూపీఐ మోసాలకు గురైన వెంటనే 1930కు కాల్ చేయాలని టెలంగానా పోలీస్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. వేగంగా ఇచ్చే సమాచారమే నష్టాన్ని తగ్గించగలదని అధికారులు తెలిపారు. డిజిటల్ చెల్లింపులను సురక్షితంగా ఉపయోగించేందుకు ప్రజలు క్రమం తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular