Friday, February 27, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుఆలయకమిటీఅధ్యక్షులునాగారంశ్రీనివాస్ నేతృత్వంలో దత్తజయంతి సందర్భంగా భిక్షాటన కార్యక్రమం

ఆలయకమిటీఅధ్యక్షులునాగారంశ్రీనివాస్ నేతృత్వంలో దత్తజయంతి సందర్భంగా భిక్షాటన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

సంగారెడ్డిజిల్లా.డిసెంబర్4(మనప్రజాప్రతినిధి)
సంగారెడ్డి జిల్లా లోపలి కోట శ్రీ హనుమాన్ మందిరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గురువారం దత్త జయంతి సందర్భంగా భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు. హనుమాన్ మందిరం నుండి ప్రారంభమైన ఈ భిక్షాటనలో మందిర పరిసర దుకాణాలు, ఇంటింటికి వెళ్లి భిక్ష సేకరణ చేశారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు నాగారం శ్రీనివాస్ మాట్లాడుతూ,“పరమశివుడే దత్తాత్రేయ స్వరూపంలో వచ్చారని భక్తులు విశ్వసిస్తారు. అందుకే భక్తులు తమకు తోచిన విధంగా ధనం, ధాన్యం రూపంలో భిక్షగా సమర్పించారు” అని తెలిపారు.
కార్యక్రమంలో పూజారి చంద్రశేఖర్, పోలా నిర్మల మనోహర్, గాజుల అశోక్, మునిపల్లి రామకృష్ణ, మధ్యల రమేష్, నాగారం పెంటయ్య, మునిపల్లి విశ్వనాథం, బిట్ల ప్రేమ్ కుమార్, పద్మ మల్లేశం, పద్మ గణేష్, గున్నాల శివ, బాలరాజు, పోలా సతీష్ కుమార్, సోలాపురం నవీన్ కుమార్, సోలాపురం శ్రావణ్ కుమార్, జిలేబి కన్నా, రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular