సదాశివపేట,డిసెంబర్29(మనప్రజాప్రతినిధి)
సదాశివపేట మండలంలోని జెడ్‌పిహెచ్‌ఎస్ ఆత్మకూర్ పాఠశాలలో ఆశ్రయ్ ఆకృతి స్వచ్ఛంద సంస్థ మరియు క్వాల్కమ్ వారి సహకారంతో విద్యార్థులకు చెవి, ముక్కు, గొంతు, కంటి సంబంధిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.డాక్టర్ అరుణ మరియు వారి వైద్య బృందం ఈ పరీక్షలు నిర్వహించి, ముక్కు, చెవి, గొంతు, కంటి అవయవాల పట్ల విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ముఖ్యంగా కంటి పరీక్షలు నిర్వహించి, లోపాలు ఉన్న విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాలు అందజేస్తామని డాక్టర్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల విద్యాధికారి ఎన్. శంకర్, పాఠశాల సిబ్బంది విద్యార్థులకు ఆరోగ్యంపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.అలాగే ఆత్మకూర్ గ్రామ సర్పంచ్ వడ్ల నిఖిత బింబాదర్ చారి, గ్రామ మార్కెట్ కమిటీ డైరెక్టర్ యూసఫ్, వార్డు మెంబర్ అనంతయ్య, కాంగ్రెస్ పార్టీ మండల యువజన విభాగం అధ్యక్షుడు బింబాదర్ చారి మాట్లాడుతూ విద్యార్థులు చెవి, కంటి, గొంతు వంటి అవయవాలను శుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.జెడ్‌పిహెచ్‌ఎస్ ఆత్మకూర్ విద్యార్థులకు ఈ వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ బృందానికి పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు సందీప్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
జెడ్‌పిహెచ్‌ఎస్ఆత్మకూరులో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
RELATED ARTICLES

