Friday, February 27, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్ప్రాణ రక్షణకు హెల్మెట్ కవచం-ఏర్పేడులో పోలీసుల కఠిన హెచ్చరిక

ప్రాణ రక్షణకు హెల్మెట్ కవచం-ఏర్పేడులో పోలీసుల కఠిన హెచ్చరిక

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//ఏర్పేడుమండలం.డిసెంబర్18
రోడ్డు ప్రమాదాల నివారణలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి వాహనదారుడికి హెల్మెట్ ఒక సంజీవని వంటిదని ఏర్పేడు సీఐ శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు గురువారం రాత్రి ఏర్పేడు పట్టణంలో విస్తృత స్థాయిలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులను నిలిపివేసి, ప్రమాదాల తీవ్రత, ప్రాణనష్టం గురించి వివరంగా అవగాహన కల్పిస్తూ కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూహెల్మెట్ ధరించకపోవడం చిన్న నిర్లక్ష్యంలాఅనిపించినా, ప్రమాదం జరిగితే అది ప్రాణాంతకంగా మారుతుందనిహెచ్చరించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహన ప్రమాదాల్లో తల గాయాలే ఎక్కువగా మరణాలకు కారణమవుతున్నాయని, హెల్మెట్ ధరించడం ద్వారా ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. అందుకే ఇకపై హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.వాహనదారులు తమ ప్రాణాలను కాపాడుకోవడమే కాకుండా, తమ కుటుంబాలకు భరోసాగా నిలవాలంటే తప్పనిసరిగా హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణించాలని ఆయన సూచించారు. అలాగే రోడ్డు భద్రతపై సమాజంలో అవగాహన పెంచే భాగంగా, హెల్మెట్ లేకుండా వచ్చిన ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ సరఫరా చేయవద్దని పెట్రోల్ బంక్ యజమానులు, సిబ్బందికి సూచనలు ఇచ్చారు.ఈ ప్రత్యేక భద్రతా కార్యక్రమంలో ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తో పాటు ఏర్పేడు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని రోడ్డు భద్రతపై ప్రజలకు విలువైన సూచనలు అందించారు.
హెల్మెట్ ఒక నిబంధన మాత్రమే కాదు –
👉 అది ఒక ప్రాణ రక్షణ కవచం
👉 ఒక కుటుంబానికి భద్రత
👉 ఒక బాధ్యతగల పౌరుని గుర్తింపు
హెల్మెట్ ధరించండి-సురక్షితంగా ప్రయాణించండి-జీవితాన్ని కాపాడుకోండి.అని సూచించారు..

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular