Friday, February 27, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుకొలనూరు గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదంద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరిని ఢీకొట్టి పరారైన గుర్తు తెలియని...

కొలనూరు గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం
ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరిని ఢీకొట్టి పరారైన గుర్తు తెలియని వాహనం

📰 Generate e-Paper Clip

క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలింపు
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.డిసెంబర్18
రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి పరారైన సంఘటన గ్రామంలో కలకలం రేపింది.ఈ ప్రమాదంలో కాదాస్ శంకర్ (42), తండ్రి వెంకయ్య, కాదాసు రాములు (40), తండ్రి ఎల్లయ్య అనే ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో వాహనం వీరిద్దరిని ఢీకొట్టిన అనంతరం కాళ్లపై నుంచి ఎక్కించుకుంటూ వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.సంఘటనను గమనించిన గ్రామస్తులు వెంటనే స్థానికుల సహాయంతో 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈఎంటి శ్రీకాంత్, పైలట్ మహేష్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular