నిరంతరం గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటా-సర్పంచ్ బొమ్మ మల్లయ్య
మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.డిసెంబర్22
కొండపాక మండలంలోని రాంపల్లి గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్‌గా బొమ్మ మల్లయ్య సోమవారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఎల్లప్పుడూ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.తన గెలుపులో భాగస్వాములైన గ్రామ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని పేర్కొన్న బొమ్మ మల్లయ్య, రాబోయే రోజుల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పరిశుభ్రత, తాగునీరు, రహదారులు, సంక్షేమ పథకాల సమర్థ అమలుపై ప్రత్యేక దృష్టి సారించి రాంపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని స్పష్టం చేశారు.
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సర్పంచ్‌తో పాటుఉప సర్పంచ్‌గా అతుకూరి మాధవి సుధాకర్,వార్డు సభ్యులుగా మీసా కిష్టవ్వ, అతుకూరి వైకుంఠం, సీత యాదగిరి, కొంతం శ్రీనివాస్, బొమ్మ స్వామి, దరం రజిని సంపత్ రెడ్డి, వుడేం స్వప్న మహిపాల్ రెడ్డి లు ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు అభినందనలు తెలియజేశారు. గ్రామాభివృద్ధి మరింత వేగంగా జరగాలని ఆకాంక్షించారు.
గ్రామ సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధం-సర్పంచ్ బొమ్మ మల్లయ్య
RELATED ARTICLES

