మనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం,డిసెంబర్28
ఎర్పేడు మండలంలో శైవ సంప్రదాయంలో విశేష ఖ్యాతి గాంచిన శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానాన్ని అన్నమయ్య జిల్లా కలెక్టర్ సుశాంత్ కుమార్ కుటుంబ సభ్యులు ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వాదాలు పొందారు.పురాణకథనాలప్రకారం పరశురామేశ్వర స్వామిదేవాలయంఎంతో మహిమాన్వితమైనదిగా భావిస్తారు.పరశురాముడు ప్రతిష్ఠించిన స్వయంభూ లింగంగా ఈ ఆలయానికి విశేష ప్రాముఖ్యత ఉంది. భక్తులు మనస్ఫూర్తిగా కోరిన కోరికలు తీరుతాయని, కుటుంబ సంక్షేమం, ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని భక్తుల నమ్మకం. శివ భక్తులకు ఈ క్షేత్రం ఒక పవిత్ర పుణ్యస్థానంగా నిలుస్తోంది.కలెక్టర్ కుటుంబ సభ్యులు. కలెక్టర్ గారి బంధువు కరుణ శర్మలు.ఆలయానికి చేరుకోగానే ఆలయ చైర్మన్ బత్తల గిరినాయుడు, కార్యనిర్వాహక అధికారి రామచంద్ర రెడ్డి, ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆలయ అధికారులు కలెక్టర్ కుటుంబ సభ్యులకు వివరించారు.
శ్రీ పరశురామేశ్వర స్వామిని దర్శించుకున్న అన్నమయ్య జిల్లా కలెక్టర్ కుటుంబ సభ్యులు
RELATED ARTICLES

