మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.డిసెంబర్6
భారత రాజ్యాంగ నిర్మాత, సమాజ సమానత్వానికి అంకితమైన మహనీయుడు డా. బి.ఆర్. అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లి గ్రామంలో ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పూజల హరికృష్ణ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్ చూపిన ఆలోచనలే దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.సామాజిక న్యాయం, సమానత్వం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.గ్రామ ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో అర్బన్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొలిమి బిక్షపతి, సీనియర్ నాయకులు బొమ్మల యాదగిరి, కాలీముద్దీన్ అహ్మద్, కౌన్సిలర్ ఎల్లం యాదవ్, నాయకులు దాస అంజన్న, మార్క సతీష్,రాజ బహదూర్ రెడ్డికొత్త మహిపాల్ రెడ్డి, డీసీసీ మహిళా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి, ఏళ్ళు శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వరాలయ కమిటీ సభ్యులు ఉప్పెరెట్ల సంతోష, సత్యనారాయణ, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.అంబేద్కర్ ఆశయాలతో ఎన్సాన్పల్లి గ్రామం ఆ రోజు మొత్తం ప్రతిధ్వనించింది…
ఎన్సాన్పల్లిలోఅంబేద్కర్ వర్ధంతికాంగ్రెస్ శ్రేణులఘననివాళులు
RELATED ARTICLES

