📄 ePaper
Saturday, August 29, 2026
Homeఆంధ్రప్రదేశ్డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి ఘనంగా నిర్వహణ

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి ఘనంగా నిర్వహణ

📰 Generate e-Paper Clip

ఏర్పేడు మండలం కేంద్రంలో ఘన నివాళులు అర్పించిన కూటమి నాయకులు
మనప్రజాప్రతినిధి,ఏర్పేడు మండలం.డిసెంబర్6
భారత రాజ్యాంగ శిల్పి, సమాజ సమానత్వం కోసం జీవితాంతం పోరాటం చేసిన మహానేత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతిని ఏర్పేడు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ప్రత్యేక పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ అంబేద్కర్ గారు దేశానికి అందించిన రాజ్యాంగం వల్లే నేటి ప్రజాస్వామ్యం బలపడిందని తెలిపారు. బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను గ్రామస్థాయిలో ప్రజల మధ్య తీసుకెళ్లడం తమ బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:టీడీపీ సీనియర్ నాయకులు ధనంజయలు నాయుడు,టీడీపీ మండల అధ్యక్షులు నాగరాజు నాయుడు,నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణమ్మ, తిరుపతి పార్లమెంట్ బీసీ సెల్ ఉపాధ్యక్షులు రాచేటి సుబ్రహ్మణ్యం, పార్లమెంట్ ఎస్సీ సెల్ నాయకులు కేకే రమణ,సర్పంచ్ గుణ యాదవ్,డాక్టర్ మునెయ్య, శీను, ఏకాంబరం, హరి రెడ్డి,ప్రధాన కార్యదర్శి ముని రెడ్డి,మెంతు గోపి, సుబ్రహ్మణ్యం, చంద్రారెడ్డి, నాగేశ్వరరావుతదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.కార్యక్రమం చివరలో అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ గ్రామాభివృద్ధి, సామాజిక సమానత్వం కోసం కలిసి పని చేస్తామని అందరూ ప్రతిజ్ఞ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.