మనప్రజాప్రతినిధి // సిద్దిపేటనియోజకవర్గం. చిన్నకోడూరుమండలం. డిసెంబర్ 1
ప్రలోభాలకుతావులేదుసీఐ ఎం.శ్రీనుకఠినహెచ్చరిక
చిన్నకోడూరుమండలంలో స్థానిక సంస్థల ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా జరగేందుకు పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. మండలంలోని చిన్నకోడూరు, గుర్రాల గొంది, రామంచ, చంద్లపూర్ గ్రామాల్లో పోలీసులు అర్ముడ్ ఫోర్స్‌తో కలిసి భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా జరిగిన ఈ కవాతులో సీఐ ఎం. శ్రీను, ఎస్ఐ యండి సైఫ్ అలీ, అర్ముడ్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.సీఐ ఎం. శ్రీను మాట్లాడుతూ“ఎన్నికల్లో మద్యం, డబ్బులు లేదా ఇతర ప్రలోభాల ద్వారా ఓటర్లపై ప్రభావం చూపితే కఠిన చర్యలు తప్పవు. అక్రమాలను సహించం” అని హెచ్చరించారు.
ఓటర్లుభయపడకుండా,స్వేచ్ఛగాతమ ఓటుహక్కును వినియోగించుకునేలా గ్రామాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి అనుమానాస్పద కదలికపై ప్రత్యేక నిఘా కొనసాగుతున్నట్లుఅధికారులు పేర్కొన్నారు.ఓటుకో నోటుకో లొంగకండి
ఓటును నమ్ముకోండి… అమ్ముకోకండి
5 సంవత్సరాలు బానిసలు కాకండి

