Friday, February 27, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుప్రశాంతవాతావరణంలోఎన్నికలుజరుపకోవాలిఎస్సై హరీష్ గౌడ్.

ప్రశాంతవాతావరణంలోఎన్నికలుజరుపకోవాలిఎస్సై హరీష్ గౌడ్.

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట, భూంపల్లి మండలం
దుబ్బాక నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా
అక్బర్‌పేట భూంపల్లి మండలంలో జరుగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తిగా శాంతియుత వాతావరణంలో, నిష్పక్షపాతంగా జరగాలని ఎస్సై హరీష్ గౌడ్ సూచించారు. ఎన్నికల సందర్భంగా ఎవరైనా కోడ్‌ను ఉల్లంఘించినా, అధికారుల విధులకు ఆటంకాలు కలిగించినా చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఎన్నికల్లో ప్రజలు అధికారులకు పూర్తి సహకారం అందించి, తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా యువత ఎన్నికల నియమాలు ఉల్లంఘించి, తమ భవిష్యత్తు ప్రమాదంలోకి నెట్టుకోవద్దని స్పష్టం చేశారు.
ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు పోలీసులకు సహకరించాలని, ఓటర్లను ప్రభావితం చేయడానికి డబ్బులు, మద్యం పంపిణీ చేయడం చట్టరీత్యా నేరం అని ఎస్సై హరీష్ గౌడ్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. ప్రజలు తమ ఓటును సద్వినియోగం చేసుకొని, ప్రలోభాలకు లొంగకుండా ప్రజాస్వామ్యాన్ని బలపర్చాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular