Sunday, March 1, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుమత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలి : మెలిగిరిపేట చెరువులో చేప పిల్లల విడుదల

మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలి : మెలిగిరిపేట చెరువులో చేప పిల్లల విడుదల

📰 Generate e-Paper Clip

సర్పంచ్ షాబొద్దీన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మధుకర్ రెడ్డి
సదాశివపేట,డిసెంబర్28(మనప్రజాప్రతినిధి)
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మెలిగిరిపేట గ్రామ చెరువులో ఆదివారం సుమారు ఆరు లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్యకారులు చేపల పెంపకం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన చేప పిల్లలను చెరువులో వదిలారు.ఈ కార్యక్రమాన్ని మెలిగిరిపేట గ్రామ సర్పంచ్ షాబొద్దీన్, మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని తెలిపారు. చేపల పెంపకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతా యని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో హనుమంత్ రెడ్డి, మలే శ్రీనివాస్ రెడ్డి, మన్నే లక్ష్మణ్, మన్నే వెంకటేశం, బోయిని కృష్ణతో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular