📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలు“ఒక్కసారి ఈ బీసీ బిడ్డకు అవకాశం ఇవ్వండి… రాంపూర్ మార్పు నా చేతుల మీదుగా!”

“ఒక్కసారి ఈ బీసీ బిడ్డకు అవకాశం ఇవ్వండి… రాంపూర్ మార్పు నా చేతుల మీదుగా!”

📰 Generate e-Paper Clip

సర్పంచ్ అభ్యర్థి చెత్రి స్వప్న ముత్యం
మన ప్రజాప్రతినిధి//సిద్దిపేట మండలం.డిసెంబర్11
రాంపూర్… ఊరి పేరు చిన్నదైనా,
ఈ గ్రామం ఇచ్చిన ప్రేమ, సంస్కారం, ఆత్మీయత మాత్రం ఈ లోకంలో పెద్దదైంది అని చెత్రి స్వప్న ముత్యం భావోద్వేగంతో తెలిపారు.
“ఈ గ్రామం నాకు చిరునామా మాత్రమే కాదు…జీవితాన్ని నిలబెట్టు కోవడానికి కావాల్సిన నైతిక విలువలను నేర్పిన గురువులానిలిచింది” అని అన్నారు.“మీరు నన్ను ఎప్పుడూ మీ ఇంటి ఆడబిడ్డలా చూసారు.మీళ్లాంటి పెద్దలు, చిన్న వారు చూపిన ఆ ప్రేమే ‘గ్రామం కోసం ఏదైనా చేయాలి’ అనే సంకల్పానికి నాకు బలం ఇచ్చింది” అని స్వప్న ముత్యం కన్నీళ్లు ఆపుకుంటూ చెప్పారు.
“గ్రామం ఒక్కరి వల్ల ఎదగదు… ప్రతి కుటుంబం ఎదిగితేనే ఎదుగుతుంది”“మన ఊరికి ఉన్న లోటుపాట్లను చూసినప్పుడు…
ఎందుకు మన గ్రామం వెనకబడాలి?ఎందుకు మన పిల్లలు మంచి సదుపాయాల కోసం బయటకు వెళ్లాలి?అనే ప్రశ్న నన్ను పదే పదే వేధించింది.ఆ ప్రశ్నలకు సమాధానాలు చూపించడానికి…
ఈ రోజు మీ ముందుకు వచ్చాను” అని ఆమె తెలిపారు.
స్వప్న ముత్యం ప్రకటించిన రాంపూర్ అభివృద్ధి పథకం
గ్రామ భద్రత కోసం సీసీ కెమెరాలు
చిన్నారుల కోసం శాశ్వత అంగన్వాడీ భవనం
యువత కోసం లైబ్రరీ & క్రీడా ప్రాంగణం
ప్రజల కార్యక్రమాలకు మినీ ఫంక్షన్ హాల్
మురుగు కాలువలు, త్రాగునీరు, సాగునీటి నిర్వహణ
పెండింగ్‌లో ఉన్న గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం
హనుమాన్ ఆలయం పూర్తి చేయడానికి అదనపు సహాయం
ప్రజల అందరి సూచనలతో రాంపూర్ రూపురేఖలు మార్చే జాగ్రత్తల ప్రణాళిక“నాయకత్వం నాకు అహంకారం కాదు — బాధ్యత”
“నాపై ఎలాంటి పెద్ద నేపథ్యం లేదు…బీసీ బిడ్డను…మీరు ఇచ్చిన ప్రేమతో, మీరే నడిపించారు ఈ స్థాయికి.నేనేమీ గొప్పది వాగ్దానం చేయట్లేదు…కానీ ఒక మాట మాత్రం చెబుతున్నాను అడ్డు వచ్చినా వెనక్కి తగ్గను.గ్రామం కోసం ఆగను.”“ఎవరితోనూ పోటీ కాదు… అభివృద్ధితోనే పోటీ”“మన పెద్దలు చూపిన మార్గం… మన పిల్లలకు మనం ఇచ్చే పునాది.మార్పు కోసం ఒకరికి అవకాశమివ్వాలి… అని ఎప్పుడూ మనమే చెబుతాం.అదే అవకాశం ఈసారి-ఈ బీసీ బిడ్డకు ఇవ్వండి.నేను నా ప్రాణం పెట్టి పనిచేస్తాను.”“రాంపూర్ నా తల్లి… తల్లికి ఎన్ని చేసినా తక్కువే”“నా ఊరు నా హృదయం…ప్రతి కుటుంబం చిరున వ్వు చందించే రాంపూర్ కావాలని నా ఆశయం. మీరు నమ్మకం ఇస్తే…మీరుగర్వపడే రాంపూర్‌నునిర్మిస్తాను.”డిసెంబర్ 14న కత్తెర గుర్తుకు (2వ నెంబర్) మీ ఓటు అమూల్యమైన ఆశీర్వాదం“మీ ఆశీర్వాదం ఒక ఓటు రూపంలో నాకు అందితే…రాంపూర్ ఎదుగుదల నా చేతుల మీదుగా జరిగేలా కృషి చేస్తాను.
14 డిసెంబర్-2వ నెంబర్-కత్తెర గుర్తు
మీ ప్రతి ఓటు నాకు కాదు…
మన రాంపూర్ భవిష్యత్తుకు.”
ఇట్లు
మీ ఇంటి ఆడబిడ్డ
చెత్రి స్వప్న ముత్యం
రాంపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.