📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తా: సర్పంచ్ అభ్యర్థి బొమ్మ మల్లయ్య

ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తా: సర్పంచ్ అభ్యర్థి బొమ్మ మల్లయ్య

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.డిసెంబర్12
కొండపాక మండలం రాంపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బొమ్మ మల్లయ్య ప్రజల ముందుకు వచ్చారు. గ్రామ అభివృద్ధినే లక్ష్యంగా పెట్టుకుని, గ్రామ ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో వుంటూ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని మల్లయ్య తెలిపారు.
రాంపల్లి గ్రామం అభివృద్ధి కోసం చేపట్టనున్న ముఖ్య కార్యక్రమాలుగా • మార్కెట్ యార్డ్ నిర్మాణం,
• గ్రామ మోరీల పునరుద్ధరణ,
• సీసీ కెమెరాల ఏర్పాటు,
• గ్రామపు మౌలిక వసతుల మెరుగుదల-అంశాలను ప్రాధాన్యంగా తీసుకుంటానని ఆయన ప్రకటించారు.“ఒక్కసారి అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా” అని బొమ్మ మల్లయ్య ప్రజలకు హామీ ఇస్తూ, పుట్‌బాల్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటును వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.