📄 ePaper
Thursday, July 16, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఇర్కోడ్ గ్రామ సర్పంచ్ బరిలో జగ్గు కృష్ణ

ఇర్కోడ్ గ్రామ సర్పంచ్ బరిలో జగ్గు కృష్ణ

📰 Generate e-Paper Clip

“ఎ సమస్య ఉన్నా అందుబాటులోనే… నాయకుడిగా కాదు, సేవకుడిగా మేదులుతాను”

మనప్రజాప్రతినిధి// సిద్దిపేటనియోజక వర్గం. డిసెంబర్ 2
ఇర్కోడ్ గ్రామ సర్పంచ్ పదవికి జగ్గు కృష్ణ బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించారు. గ్రామ ప్రజల సమస్యలను ఎప్పుడూ వినేందుకు, పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. చిన్నాపెద్దా అనే తారతమ్యాలు లేకుండా, స్నేహశీలి భావంతో ప్రతి ఒక్కరితో మెలుగుతానని హామీ ఇచ్చారు.
గ్రామంలో నీటి సరఫరా, డ్రైనేజీ, పారిశుద్ధ్యం వంటి ముఖ్య సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు కట్టుబడి పనిచేస్తానని పేర్కొన్నారు. ప్రజల ఆవశ్యకతలు, వారి సూచనలు నా పనికి దిశానిర్దేశం అవుతాయని, ప్రజల అండదండలతో గ్రామ అభివృద్ధిని వేగవంతం చేయడమే తన ప్రధాన లక్ష్యం అని జగ్గు కృష్ణ తెలిపారు.
“నాయకుడిగా కాదు.ఇర్కోడ్ గ్రామానికి సేవకుడిగా, సేవాభావ దృక్పథంతో పని చేయడం నా ధ్యేయం” అని ఆయన గ్రామ ప్రజలకు వినతి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular