Friday, February 27, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న కేకే భాగ్యలక్ష్మి కుటుంబ సభ్యులు

శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న కేకే భాగ్యలక్ష్మి కుటుంబ సభ్యులు

📰 Generate e-Paper Clip

శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్‌గా బాధ్యతల స్వీకరణ అనంతరం తిరుమలలో ప్రత్యేక పూజలు మనప్రజాప్రతినిధి-ఏర్పేడుమండలం.డిసెంబర్18
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం మేర్లపాక గ్రామానికి చెందిన తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి కేకే రమణ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్‌గా కేకే భాగ్యలక్ష్మి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఈ దర్శనం విశేషంగా నిలిచింది.ఈ సందర్భంగా కేకే రమణ మాట్లాడుతూ, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆశీస్సులు, ఏర్పేడు మండలం టీడీపీ పార్టీ అధ్యక్షులు పేరంనాగరాజు నాయుడు చొరవ, అలాగే మండల కూటమి నాయకులు–కార్యకర్తల అండదండలతోనే ఈ బాధ్యతలు లభించాయని స్పష్టం చేశారు. తమపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.శ్రీకాళహస్తి నియోజకవర్గం ప్రజలంతా సుఖసంతోషాలతో, సమృద్ధిగా ఉండాలని, రైతాంగం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ తిరుమలలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించినట్లు తెలిపారు. ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతామని, వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామని కేకే భాగ్యలక్ష్మి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.ఈ దర్శనం రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారి, కేకే కుటుంబానికి మరింత ప్రజాదరణ తీసుకువచ్చింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular