మనప్రజాప్రతినిధి//రాజన్న సిరిసిల్ల.డిసెంబరు 01
ప్రపంచ ఎయిడ్స్ దినాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎయిడ్స్ వ్యాధి నివారణపై కీలక సూచనలు చేశారు.డాక్టర్ రజిత మాట్లాడుతూ“ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన పెంపొందించడం ద్వారా మాత్రమే మహమ్మారిని తరిమికొట్టవచ్చు. రక్షణ లేకుండా శారీరక సంబంధం ద్వారా హెచ్ఐవి వ్యాపిస్తుంది. హెచ్ఐవీకి శాశ్వత చికిత్స లేకపోయినా, ART కేంద్రాల్లో అందించే మందులు వాడితే ఎన్నో సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించవచ్చు” అన్నారు.
రెడ్ రిబ్బన్ ఎయిడ్స్‌పై అవగాహనకు చిహ్నమని, హెచ్ఐవి సోకినంత మాత్రాన బాధపడకూడదని, సురక్షిత జీవనశైలి పాటిస్తే ఎయిడ్స్ నివారించడం సాధ్యమని ఆమె వివరించారు.
జిల్లాలో హెచ్ఐవి గణాంకాలు
సిరిసిల్ల జిల్లాలో ఏప్రిల్ 25 నుంచి నవంబర్ 25 వరకు
మొత్తం 2521 గర్భిణీ స్త్రీలకు పరీక్షలు1 పాజిటివ్అనుమానిత4118 కేసులు పరిశీలించగా 26 మందికి పాజిటివ్ నిర్ధారణ.గ్రామీణ స్థాయిలో ఎన్జీవోలు, మహిళా సమాఖ్యలు, లింక్ వర్కర్లు కలిసి అవగాహన కార్యక్రమాలు చేపట్టి ఎయిడ్స్ వ్యాధిని అరికట్టాలని ఆమె సూచించారు.సేవా పురస్కారాలుర్యాలీ ప్రారంభంకార్యక్రమంలో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి మెమెంటోలు, ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఎయిడ్స్ అవగాహన ర్యాలీకి డాక్టర్ రజిత జెండా ఊపి ప్రారంభించారు.హాజరైన వారు.ఎన్జీవో ప్రెసిడెంట్ చింతోజు భాస్కర్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అనిత, AO శ్రీనివాస్, దేవి సింగ్, డిప్యూటీ డెమో రాజకుమార్, ఎయిడ్స్ కౌన్సిలర్ గంగయ్య, సూపర్వైజర్లు, ఏఎन్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎయిడ్స్ మహమ్మారిని తరిమికొడదాం
RELATED ARTICLES

