మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.డిసెంబర్23
గ్రామ అభివృద్ధినే ప్రధాన లక్ష్యంగా తీసుకుని దుద్దెడ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని నూతన సర్పంచ్ మిద్దె శివకుమార్ స్పష్టంగా తెలిపారు. సోమవారం సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన అధికారికంగా పదవి బాధ్యతలు చేపట్టి ప్రజలకు భరోసా కలిగించే మాటలు వినిపించారు.ఈ సందర్భంగా మిద్దె శివకుమార్‌ను గ్రామ పెద్దలు, నాయకులు శాలువలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వృథా చేయబోనని, పారదర్శక పాలనతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తానని హామీ ఇచ్చారు.అందరి సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, గ్రామ శ్రేయస్సే తన బాధ్యతగా భావించి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని మిద్దె శివకుమార్ స్పష్టం చేశారు.
దుద్దెడ సర్పంచ్‌గా మిద్దె శివకుమార్ ప్రమాణ స్వీకారంగ్రామాభివృద్ధికి స్పష్టమైన దిశ-ప్రజలకు భరోసా
RELATED ARTICLES

