మనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.డిసెంబర్ 2
ఎర్పేడు మండలంలోని ఇసుక తాగేలి చెరువు ఇటీవల దిత్వ తుఫాను ప్రభావం వల్ల కురిసిన వర్షాలతో నిండిపోగా, కలువ ద్వారా నీరు ప్రవహిస్తున్న సమయంలో చెరువు కట్టకు తేలికపాటి గండి పడింది. ఈ విషయాన్ని గ్రామ హాయికట్టు ప్రెసిడెంట్ గమనించి వెంటనే సంబంధించిన అధికారులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. గండి పడిన ప్రాంతంలో ఇసుక బస్తాలతో అత్యవసర మరమ్మతులు చేపట్టారు.
చేరుకుని పర్యవేక్షించిన అధికారుల్లో ఏర్పేడు మండల తహసీల్దార్ ఏ. భార్గవి, ఎంపీడీవో సౌభాగ్యం, ఇరిగేషన్ ఏఈ జైకుమార్, ఆర్‌ఐ సుబ్రహ్మణ్యం, వీఆర్వో శ్రీవిద్య, వీఆర్ఏ జగదీష్ ఉన్నారు. హాయికట్టు ప్రెసిడెంట్ రామిరెడ్డితో పాటు కొంతమంది గ్రామస్థులు కూడా అక్కడ హాజరయ్యారు.అధికారులు చెరువు పరిస్థితిని పరిశీలించి భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
చెరువుకు తేలికపాటి గండి పడడంతోఅప్రమత్తమైన అధికారులు
RELATED ARTICLES

