సదాశివాపేట,డిసెంబర్16(మనప్రజాప్రతినిధి)
పీఎంఆర్ అంటేనే ప్రజల మనిషి, సేవాభావానికి ప్రతిరూపం అని సుహాస్ ప్రాజెక్ట్స్ బిల్డింగ్ ట్రస్ట్ క్రియేటింగ్ ఎక్సలెన్స్ చైర్మన్ శ్రీమతి సామినేని అంజలి, శ్రీ కృష్ణ ప్రశంసించారు. పులిమామిడి రాజు జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం హైదరాబాద్‌లోని సుహాస్ ప్రాజెక్ట్స్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.సుహాస్ ప్రాజెక్ట్స్అధినేతలుఅంజలికృష్ణగారి ఆధ్వర్యంలో సంస్థ సిబ్బంది, మిత్రబృందం కలిసి పులిమామిడి రాజును శాలువాతో ఘనంగా సన్మానించి,పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి హర్షాతిరేకాలతో వేడుకలు జరిపారు.ఈ సందర్భంగాఅంజలిగారు మాట్లాడుతూ, పులిమామిడి రాజు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలనిఆకాంక్షించారు. రానున్న రోజుల్లో పీఎంఆర్ ఫౌండేషన్ ద్వారా మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పేదవారిని చూసిన వెంటనే స్పందించే హృదయం రాజుకి ఉండటం అరుదైన లక్షణమని, అలాంటి వ్యక్తి సంగారెడ్డి జిల్లాకు లభించడంప్రజలఅదృష్టమని పేర్కొన్నారు.భవిష్యత్తులో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవాలన్న రాజు ఆశయం నెరవేరాలని, ఆ దేవుడు ఆయన కోరికను తీర్చాలని తమ తరపున ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రజాసేవలో రాజు చేసే ప్రతి మంచి పనికి తామందరం వెన్నంటూ ఉంటామని స్పష్టం చేశారు. అలాగే, ఇలాంటి సేవా కార్యక్రమాలకు సుహాస్ ప్రాజెక్ట్స్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మహేందర్, యాదయ్య, ప్రసాద్, నకుల్, రాగం అనిల్, సోమ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
జనంమెచ్చిననాయకుడుపులిమామిడిరాజు
RELATED ARTICLES

