📄 ePaper
Thursday, July 16, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుచికిత్సపొందుతూవ్యక్తిమృతి

చికిత్సపొందుతూవ్యక్తిమృతి

📰 Generate e-Paper Clip

మెదక్.మనప్రజాప్రతినిధి//డిసెంబర్6
నేషనల్ హైవే161 పై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ముగ్గురిలో ఒకరు మృతిచెందిన ఘటన అల్లాదుర్గం మండలం రాంపూర్ శివారులో చోటుచేసుకుంది.
ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారంసంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండలం మునిగేపల్లి గ్రామానికి చెందిన సో హైలౌ (28) హైదరా బాదులో ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తు న్నాడు. గురువారం సాయంత్రం హైదరాబాదు నుండి తన అన్న భార్య ఫాతిమా, వారి కుమార్తెతో కలిసి కారులో స్వగ్రామం వైపు బయలుదేరాడు.రాంపూర్ గ్రామ శివారులోకి రాగానే ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ కారును ఢీకొనడంతో ముగ్గురికి తీవ్రమైన గాయాల య్యాయి.వెంటనే వారిని సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే సో హైలౌ చికిత్స పొందుతూ మృతిచెందాడు.మృతుడి తండ్రి సఫియోద్దీన్ ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై శంకర్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular