మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్ 23
ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కేషవేని రాజేశం ఇటీవల గుండెపోటుతో అకాల మరణం చెందడం గాలిపల్లి గ్రామాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. ఈ విషాద సమయంలో మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.రాజేశం చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన రసమయి బాలకిషన్, ఆయనతో గడిపిన సందర్భాలను గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. రాజేశం ప్రజల మధ్య జీవించిన నాయకుడని, నిరంతరం గ్రామ అభివృద్ధి కోసం పరితపించిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఆయన ఆకస్మిక మరణం పార్టీకి మాత్రమే కాకుండా గ్రామ ప్రజలకు తీరని లోటని అన్నారు.
మృతుడి కుటుంబ సభ్యులతో మమేకమై మాట్లాడుతూ, ఈ కష్టకాలంలో పార్టీ తరఫున, వ్యక్తిగతంగా తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కేవిఎన్ రెడ్డి, కేషవేని శ్రీనివాస్, ర్యాగటి రమేష్, ఎడ్ల ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొని రాజేశం సేవలను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మాజీ ఎంపీటీసీ కుటుంబానికి రసమయి బాలకిషన్ హృదయపూర్వక పరామర్శ”కేషవేని రాజేశం చిత్రపటం వద్ద కన్నీటి నివాళులు
RELATED ARTICLES

