మనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం డిసెంబర్ 7
మంగళగిరిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా గత 18 నెలల కాలంలో రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమం–అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే సూపర్ సిక్స్ పథకాలు విజయవంతంగా అమలవుతున్న తీరుపై ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు.అనంతరం నియోజకవర్గంలో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అభివృద్ధి అవసరాలు, ప్రజల సమస్యలు తదితర అంశాలను సమగ్ర నివేదిక రూపంలో ముఖ్యమంత్రికి అందజేశారు.రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు మరింత మేలు చేకూర్చాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.
ఏపీముఖ్యమంత్రినికలిసినరెడ్డివారి గురువారెడ్డి
RELATED ARTICLES

